కొలు కోలో కోలోయమ్మపాట లిరిక్స్ తెలుగులో

Song: kolu kolu

Movie:VirataParvam

Singer:Divya Malika, Suresh Bobbili

Lyrics:Chandrabose

పాట-కొలు కోలో

పాడినవారు-దివ్య మాలికా, సురేష్ బొబ్బిలి

వ్రాసినవారు-చంద్రబోస్

సినిమా-విరాటపర్వం

కొలు కోలో… కోలోయమ్మ…
కొమ్మ చివరన పూలు పూసే… కోలో…
పువ్వులాంటి సిన్నదేమో… మొగ్గయింది సిగ్గుతోటి… కోలోయమ్మ…

కొలు కోలమ్మ కోలో కోలో… నా సామి
మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే
కనుల ముందర ఉంటే… నూరేళ్లు నిదుర రాదులే…

కొలు కోలమ్మ కోలో కోలో… నా సామి
మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే
కనుల ముందర ఉంటే… నూరేళ్లు నిదుర రాదులే…

పిల్లగాడు మాటలన్నీ… గాజులల్లే మార్చుకుంట
కాళీ ధూళి బొట్టు పెట్టుకుంటా…
కుర్రవాడి చూపులన్నీ… కొప్పులోన ముడుచుకుంటా
అల్లరంతా నల్ల పూసలంటా…
వాడీగూర్చి ఆలోచనే… వాడి పోనీ ఆరాధనే
తాళి లాగ మెళ్ళో వాలదా…

కొలు కోలమ్మ కోలో కోలో… నా సామి
మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే
కనుల ముందర ఉంటే… నూరేళ్లు నిదుర రాదులే…

పాదమేమో వాడిదంతా… పయనమేమో వాడిదంట
పయనమేమో నాది అంట… వాడి పెదవితోటి నవ్వుతుంటా…
అక్షరాలు వాడివంట… అర్థమంత నేను అంట…
వాడి గొంతుతోటి పలుకుతుంటా…
ప్రాణమంత వాడేనంట… ప్రాయమంత వాడేనంట…
వాడి ప్రేమై నేనే బ్రతకనా…

కొలు కోలమ్మ కోలో కోలో… నా సామి
మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే
కనుల ముందర ఉంటే… నూరేళ్లు నిదుర రాదులే…

Leave a Comment

close