Movie:Tuck Jagadish
Singer:Shreya Ghoshal,Kaala Bhairava
Lyrics:-Chaitanya Prasad
పాడినవారు-శ్రేయా ఘోషల్,కాల భైరవ
వ్రాసినవారు-చైతన్య ప్రసాద్
సినిమా- టక్ జగదీష్
ఇంకోసారి ఇంకోసారి పాట లిరిక్స్ తెలుగులో
మళ్ళోసారి మళ్ళోసారి… పిలవాలంది నువు ప్రతిసారి
మనసుకే మొదలిదే… మొదటి మాటల్లో
వయసుకే వరదిదే… వలపు వానల్లో
కుదురుగా నిలవదే… చిలిపి ఊహల్లో
తగదనీ తెలిసినా… చివరి హద్దుల్లో
నా రాదారిలో… గోదారిలా వచ్చావేమో
నీరెండల్లో నా గుండెల్లో… పున్నాగలా పూచావేమో
ఎగరేసెయ్ ఊహల్నే… చెరిపేసెయ్ హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే… చూసేద్దాం చుక్కల్నే
ఎగరేసెయ్ ఊహల్నే (ఎగరేసెయ్ ఊహల్నే)
చెరిపేసెయ్ హద్దుల్నే (చెరిపేసెయ్ హద్దుల్నే)
దాటేద్దాం దిక్కుల్నే (దాటేద్దాం దిక్కుల్నే)
చూసేద్దాం చుక్కల్నే (చూసేద్దాం చుక్కల్నే)
కవ్విస్తావు నీవు… నీ కంటి బాణాలతో, గుండె అల్లాడేలా
నవ్విస్తావు నీవు… నీ కొంటె కోణాలతో, చంటి పిల్లాడిలా
కన్నె ఈడు కోలాటమాడింది… కంటి పాపలో నిన్నే దాచింది
నిన్న లేని ఇబ్బంది బావుంది… నిన్ను కోరి రమ్మంటుంది
నా రాదారిలో… గోదారిలా వచ్చావేమో
నీరెండల్లో నా గుండెల్లో… పున్నాగలా పూచావేమో
ఎగరేసెయ్ ఊహల్నే… చెరిపేసెయ్ హద్దుల్నే
దాటేద్దాం దిక్కుల్నే… చూసేద్దాం చుక్కల్నే
ఎగరేసెయ్ ఊహల్నే (ఎగరేసెయ్ ఊహల్నే)
చెరిపేసెయ్ హద్దుల్నే (చెరిపేసెయ్ హద్దుల్నే)
దాటేద్దాం దిక్కుల్నే (దాటేద్దాం దిక్కుల్నే)
చూసేద్దాం చుక్కల్నే (చూసేద్దాం చుక్కల్నే)
ఇంకోసారి ఇంకోసారి… నీ పిలుపే నా ఎదలో చేరే
మళ్ళోసారి మళ్ళోసారి… పిలవాలంది నువు ప్రతిసారి