పాడినవారు-సిద్ శ్రీరామ్,సత్య యామిని
వ్రాసినవారు-శ్రీ మణి
సినిమా-ఇష్క్(Not a Love Story)
Movie:Ishq (Not a Love Story)
Singer:Sid Sriram, Satya Yamini
Lyrics:Shree Mani
ఆనందమానంద మదికే పాట లిరిక్స్
రంగులేవో చల్లిందా ఓహో
అందమైన ఊహేదో మదిలో వాలి
అల్లరేదో చేసిందా ఓహో
మెత్తనైన నీ పెదవులపై
నా పేరే రాశావా
నే పలికే భాషే
నువ్వయావే వెన్నెలా ఓహో
రెండు కన్నులెత్తి గుండెలపై
నీ చూపే గీశావా
ఆ గీతే దాటి అడుగునైనా
విడువలేనే నేనిలా
ఆనందమానంద మదికే
ఏమందమేమందమొలికే
నీ నవ్వు నా గుండె గదికే
వెలుగే వెన్నెలా
ఆనందమానంద మదికే
ఏమందమేమందమొలికే
నీ పిలుపు నా అడుగు నదికే
పొంగే వరదలా
మిలమిల మెరిసే
కనుచివరలే మినుకుల్లా
విసరకు నువ్వే
నీ చూపులే మెరుపుల్లా
మెరిసెనా మెల్లగా
దారిలోన మల్లెల వాన
కురిసెనా ధారగా
రంగు రంగు తారలతోనా
వీణలై క్షణాళిలా
స్వరాలూ పూసేనా
ప్రేమలో ఓ నిమిషమే
యుగాలు సాగేనా
ఆనందమానంద మదికే
ఏమందమేమందమొలికే
నీ నవ్వు నా గుండె గదికే
వెలుగే వెన్నెలా
ఆనందమానంద మదికే
ఏమందమేమందమొలికే
నీ పిలుపు నా అడుగు
నదికే పొంగే వరదలా